- బ్లడ్ థెన్సర్స్ అనగా రక్తం గడ్డ కట్టకుండా చేసే మందులు. ఇవి రక్తాన్ని పలుచగా చేయడమో (లేదా) హిమోగ్లోబిన్ శాతాన్ని తగ్గించడమో చేయవు. ఇవి కేవలం రక్తాన్ని సులువుగా గడ్డకట్టకుండా చేస్తాయి.
- డి. వి.టి, పల్సొనరీఎంబోలిజమ్, గుండె కవాటాల జబ్బు, కవాట మార్పిడి ఆపరేషన్ చేసుకొన్నవారు, కర్ణిక దడ ఉన్నవారికి పక్షవాతం నివారణకు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇటువంటి మందులను వాడవలసి ఉంటుంది.
- వీటిలో ఎసిట్రామ్, వార్ఫరిన్ వంటి మందులు రక్తంలోని విటమిన్ ‘B’ పనికి అడ్డు పడడం ద్వారా పనిచేస్తాయి. కావున ఈ మందులు వాడుతున్న రోగులు, ఆహారంలో విటమిన్ ‘కె’ మోతాదును నియంత్రించవలెను మరియు అందుకోసం కొన్ని ఆహార నియమాలు పాటించవలెను.
- వీరు ఆహారంలో విటమిన్ ‘B’ ఉండే పదార్థాలను పూర్తిగా మానేయనవసరం లేదు. ప్రతిరోజూ, ప్రతివారం ఒకే నియంత్రిత మోతాదులో విటమిన్ ‘B’ ని తీసుకోవడం చాలా అవసరం.
విటమిన్ ‘K’ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు
- మొక్కజొన్న, ఉల్లిపాయలు, వంకాయలు, టమోట, కాప్సికమ్, కీరకాయలు, పుట్టుగొడుగులు, దాదాపు అన్ని దుంపకూరలు (ఉల్లగడ్డ, బీట్ రోట్, క్యారేట్, చిలకడదుంప మొదలగునవి), కోడిగ్రుడ్డులో పచ్చసొన, కాలేయం కాకుండా మిగతా చాలా వరకు మాంసాహరము.
- ఈ ఆహార పదార్థాలలో పత్యం అవసరం లేదు. కాని విటమిన్ ‘K’ ఎక్కువ ఉండే పదార్థాలను తీసుకునేటప్పుడు, వాటిని మితంగా (రోజుకి 60 నుండి 80 MCG విటమిన్ ‘K’) నిలకడగా, నియంతరణలో తీసుకోవాలి.
- ఇటువంటి విటమిన్ ‘K’ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఉన్నట్టుంది ఎక్కువగా తీసుకొంటే రక్తం సులువుగా గడ్డకట్టి మనం వాడే బ్లడ్ థిన్నర్స్ పనిచేయకుండా పోవచ్చు అలానే వీటిని ఉన్నట్టుంది పూర్తిగా ఆపివేస్తే, బ్లడ్ థిన్సర్స్మం దుల ప్రభావం పెరిగిపోయి, రక్తం ఎక్కువగా పలుచబడి సులువుగా రక్తం కారే లక్షణాలు మరియు సమస్యలు రావచ్చు.
విటమిన్ ‘K’ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు
- ఆకు కూరలు (పాలకూర, తోటకూర, ఆవాల ఆకులు మొదలగునవి)
- క్యాబేజ్, కాళిప్లవర్, బ్రోకోలి వంటివి.
- బెండకాయలు
- బీన్స్, సోయాబీన్స్ వంటివి
- టర్నిప్
- కివి పండు
- అంతేకాక, ఈ మందులు వేసుకునేవారు గ్రీన్ టీ, ద్రాక్షరసం, క్రాన్ బెరి రసం మరియు మద్యం తీసుకో
కూడదు. గ్రీన్ టీ తీసుకుంటే ఈ మందులు సరిగ్గా పనిచేయక పోవడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది. ద్రాక్ష
రసం, క్రాన్ బెర్రి రసం మరియు మద్యం తీసుకున్న వారిలో, ఈ మందులు మితిమీరి పనిచేసి రక్తం కారే
లక్షణాలు కనపడవచ్చు. - కొన్ని నాటు మందులు, ఆకులు, పసరులు తీసుకుంటే కూడా ఈ మందలు సరిగ్గా పనిచేయకపోవచ్చు.
అంతేకాక కొన్ని ఇతర వ్యాధుల కోసం వాడే మందులో కూడా ఈ మందుల మీద ప్రభావం చూపవచ్చు.
అందుచేత మీరు వాడుతున్న అన్ని మందులని డాక్టరుకి చెప్పాలి. - కొన్ని బి-కాంప్లెక్స్ మరియు కాల్షియం మందులో కూడా విటమిన్ ‘K’ ఉంటుంది.
కావున వీటిని డాక్టరుతో సంప్రదించి కేవలం విటమిన్ ‘K’ మితంగా ఉండే ఒక్కరకం మందులు మాత్రమే వాడుకోవడం మంచిది. - మనకు వేరే ఏదైనా ఆనారోగ్యం వచ్చినప్పుడు, ఈ మందుల పనితీరుని పరిక్షించే, PT-INR విలువలు
మారవచ్చు అటువంటప్పుడు మీ డాక్కరుని సంప్రదించుకొని డోస్ అడ్జస్ట్ చేసుకొనవలెను.
Please follow and like us: