- మన భారత దేశం పొగాకు ఉత్పత్తిలో ప్రపంచంలో మూడవ స్థానంలో మరియు పొగాకు వాడకంలో రెండవ స్థానంలో ఉంది.
- మన దేశంలో అన్ని ఆరోగ్య సమస్యలలో 40% మరియు అన్ని క్యాన్సర్లలో 50% పొగాకు వాడకం వల్లవచ్చినవే. మనదేశంలో పొగాకు త్రాగడం వల్ల ఏటా 10 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు.
- యుక్త వయస్సు నుంచి పొగ త్రాగడం మొదలు పెట్టిన వారిలో మధ్య వయస్సులో 1/4 మంది మరియు మంది ముసలి వయస్సులో పొగ త్రాగడం వల్ల కలుగు సమస్యల వల్లే చనిపోతారు. యుక్త వయస్సులో పొగత్రాగడం మానేసినచో వారి జీవిత కాలం దాదాపు 20 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు.
పొగ త్రాగడం వల్ల వచ్చు ఆరోగ్య సమస్యలు :
- గుండెపోటు మరియు పక్షవాతం (2-4 రెట్లు అధిక ప్రమాదం)
- ఊపిరి తిత్తుల కాన్సర్ (23 రెట్లు అధిక ప్రమాదం)
- ఉబ్బసం వ్యాధి (మన దేశంలో 82% ఉబ్బసం పొగత్రాగటం వల్లే)
- టిబి వ్యాధి (3-4 రెట్లు అధికంగా వస్తుంది)
- నోరు, గొంతు, అన్నవాహిక, కడుపు, మూత్రాశయం మరియు ఇతర కాన్సర్లు (మన దేశంలో అన్ని కాన్సలో 50% పొగాకు వల్ల వచ్చినవే)
- కాళ్ళు మరియు చేతుల గాంగ్రీన్ వ్యాధి
- పళ్ళు పాడవటం, పిల్లలు పుట్టక పోవటం
- త్వరగా ముసలి తనం రావడం
- త్వరగా చనిపోవటం
పొగాకు నమలడం యొక్క కొన్ని వాస్తవాలు :
నమిలే పొగాకులో 3000 రసాయనాలు, 28 క్యాన్సరు కారక పదార్థాలు ఉంటాయి. రోజుకి 8-10 సార్లు పొగాకు నమలడం వల్ల 30 నుండి 40 సిగిరెట్లు త్రాగితే వచ్చేంత నికోటిన్ మన శరీరంలోకి వస్తుంది. పొగాకు నమలడం వల్ల నోరు, గొంతు, స్వర పేటిక, అన్నవాహిక సంబంధ క్యాన్సర్లు అధికంగా వస్తాయి. అధిక రక్తపోటు, గుండెపోటు మరియు ఇతర గుండె మరియు ధమన సంబంధ సమస్యలు అధికంగా వస్తాయి.
పొగత్రాగుట మానడం వల్ల కలుగు ఉపయోగాలు:
పొగత్రాగుట మానిన వెంటనే శరీరము దాని మరమ్మత్తులు మొదలు పెడుతుంది, అలా ఆరోగ్యంలో ఉపయోగకర
మార్పులు వెంటనే మొదలై ఎన్నో ఏళ్లు కొనసాగుతాయి.
- పొగత్రాగుట మానిన 20 నిమిషాలకు – రక్తపోటు మరియు గుండె వేగం సాధారణ స్థాయికి రావడం
- మొదలవుతుంది. 8 గంటలు – రక్తంలో ఆక్సిజన్ శాతం సాధారణ స్థాయికి రావడం మొదలవుతుంది మరియు గుండెపోటు వచ్చే అవకాశం తగ్గడం ప్రారంభం అవుతుంది.
- 24 గంటలు – శరీరం నుంచి కార్బన్ మోనాక్సైడ్ తొలిగించబడుతుంది మరియు ఊపిరితిత్తులు వాటిలో చేరిన మలినాలను తొలగించడం ప్రారంభిస్తాయి.
- 48 గంటలు – శరీరం నుంచి నికోటిన్ పూర్తిగా తొలగించబడుతుంది మరియు రుచి, వాసనలను పసిగట్టే సామర్థ్యం మెరుగు పడుతుంది.
- 72 గంటలు – శ్వాసకోశ ట్యూబులు వ్యాకోచించడంతో ఊపిరిపీల్చండం సులభం అవుతుంది మరియు శరీరంలో శక్తి పెరుగుతుంది.
- 2-12 వారాలు – శరీరమంతటా రక్త ప్రసరణ మెరుగు పడుతుంది మరియు దానివల్ల నడవడం సునాయాసమవుతుంది.
- 3-9 నెలలు – దగ్గు, ఆయాసం, ఉబ్బసం లాంటి శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి.
- 5 సంవత్సరాలు – ప్రొగత్రాగుటు కొనసాగించే వారితో పోలిస్తే గుండెపోటు వచ్చే అవకాసం సగానికి తగ్గుతుంది.
- 10 సంవత్సరాలు – గెండెపోటు వచ్చే అవకాశం పొగత్రాగని వారితో సమానస్థాయికి తగ్గుతంది మరియు ఊపిరితిత్తుల క్యాన్సరు వచ్చే అవకాశం సగానికి తగ్గుతుంది.
పొగత్రాగుట మానుటకు చేయగల ప్రయత్నాలు:
- పొగత్రాగటం వల్ల లాభనష్టాలు బేరీజు వేసుకోండి.
- మానేస్తున్నట్లు స్నేహితులకు, బంధువులకు అందరికి చెప్పండి.
- సిగరెట్టు వాసన పోపుటకు బట్టలన్నీ శుభ్రపరుచుకోండి.
- అగ్గిపెట్టెలు, లైటర్లు, ఆష్ ట్రేలు దూరం చేయండి.
- సిగరెట్టు బ్రాండు మార్చండి. సిగరెట్లు ప్యాకెట్లుగా కొనకండి.
- అలవాటు లేని చేత్తోనే త్రాగండి. చేతులు ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వండి.
- పొగత్రాగునపుడు చేసే పనులను కుదిరితే మానేయండి.
- సిగిరెట్టు తాగాలన్న కోరికను వీలైనంత నియంత్రించి, దాన్ని తాగడం ఎంతసేపు కుదిరితే అంతసేపు ఆలస్యం చేయండి.
- మానసిక వత్తిడి తగ్గించుకోండి.
- ప్రశాంతమైన సంగీతం వినడం, పుస్తాకాలు చదవడం, వ్యాయామం చేయడం మంచిది.
Please follow and like us: