1. పొగత్రాగడం (Smoking)
2. రక్తంలో కొలెస్ట్రాల్ కొవ్వు అధికంగా ఉండటం (Dyslipidemia) channe
3. అధిక బరువు (overweight / Obesity)
4. వ్యాయామం లేకపోవడం (Lack of exercise)
5. మధుమేహం (షుగర్ వ్యాధి) (Diabetes)
6. రక్తపోటు (High B.P)
7. మానసిక వత్తిడి (Psychosocial Stress)
90% మంది రోగులకు ఈ పై అంశములే గుండెపోటు లేదా పక్షవాతానికి కారణాలు.
నివారించే మార్గాలు:
1. పొగత్రాగడం పూర్తిగా మానేయాలి
1. పొగత్రాగడం పూర్తిగా మానేయాలి:
పొగత్రాగుట వలన గుండెపోటు, పక్షవాతం, స్వాసకోశాల జబ్బు, ఊపిరి తిత్తుల క్యాన్సర్ మరియు ఎన్నో వ్యాధులు
పొగత్రాగిన వారికి రావడమేకాక, దాన్ని పీల్చుకున్న కుటుంబీకులకి, ఇతరులకి కూడా వచ్చే అవకాశం ఉంది.
2. చెడు కొలెస్ట్రాల్ కొవ్వును నియంత్రించుకోవలెను:
(LDL) (చెడు) కొలెస్ట్రాల్ – 130 mg/dl కన్నాతక్కువ
– 100 mg | di(షుగరు వ్యాధి లేదా , 2 ప్రమాద కారణాలు ఉన్నవారు)
HDL (మంచి) కొలెస్ట్రాల్ – 40 mg/dl (పురుషులలో) కన్నా ఎక్కువ
– 50 mg/dl (స్త్రీలలో) కన్నా ఎక్కువ
Triglyceride కొవ్వు -150 mg/dl కన్నా తక్కువ
3. షుగరు వ్యాధి (Hb A,C<7%, FBS < 110 mg% is Normal):
ఆహారము ద్వారా, వ్యాయామం ద్వారా మరియు మందుల ద్వారా (షుగరు డాక్టరు సహాయంతో) షుగరును
నియంత్రణలో ఉంచుకోవాలి.
4. రక్తపోటు:
B.P.లక్ష్యం -140/90mm Hg కన్నా తక్కువ.
– 130/80 mm Hg(మూత్ర పిండాల లేదా షుగరు వ్యాధి ఉన్న రోగులకు) కన్నా తక్కువ
.లక్ష్య సాధన మార్గం:
- ఆరోగ్యకరమైన జీవనశైలి
- వ్యాయమం
- ఆహారం (ఉప్పు తగ్గించడం, అధికంగా కూరగాయలు, పండ్లు తినడం).
- మధ్య పానం మానేయడం మరియు మందుల ద్వారా రక్తపోటును నియంత్రించుకోవలెను.
5. అధిక బరువు (స్థూల కాయం):
లక్ష్యం – BMI (బరువు కేజీలలో/ఎత్తుమీటర్లలో) 18-23 మధ్య ఉండవలెను
– నడుము కొలత – మగవాళ్ళలో 36 ఇంచీలకన్న తక్కువ మరియు
ఆడవాళ్ళలో 31 ఇంచీలకన్న తక్కువ ఉండవలెను.
ఆహారంలో పిండి పదార్థాలు మరియు నూనె పదార్థాలు తగ్గించి, తద్వారా కాలరీలు తగ్గించి బరువు తగ్గవలెను.
బరువు అధికంగా ఉన్న వారు, మొదటి సంవత్సరంలో వారి బరువులో 10%(పదిశాతం) తగ్గవలెను.
6. ఆహారం
- వివిధ రకాల పండ్లు, కూరగాయాలు, ధాన్యాలు, తక్కువ కొవ్వు గల పాల ఉత్పత్తులు, చేపలు, పప్పులు తీసుకోవలెను.
- అవసరము మేరకు మాత్రమే పిండి పదార్థాలు (చెక్కెర, బెల్లం, బియ్యం, మొదలగునవి) తీసుకోవలెను.
- నూనె పదార్థాలు తగ్గించవలెను: ఆహారంలో, శాచురేటెడ్ (Saturated) (డాలా) కొవ్వు మరియు ట్రాన్ఫోట్స్ (Transfats) వాడకం తగ్గించి,అన్‌శాచురేటెడ్ (UnSaturated), కొవ్వు అధికంగా ఉండే నూనెలు (సప్లవర్ ఆయిల్, సాఫ్ ఫ్లవర్ ఆయిల్,etc.,) మరియు చేపలు, కూరగాయాలు పప్పులు వాడుకోవలెను.
- ఉప్పు వాడకం రోజుకి, వ్యక్తికి, సగటున 6 గ్రామలు మించకుండా వాడితే మంచిది.
- మధ్యం సేవించరాదు.
- షుగరు వ్యాధి ఉన్నవారు, షుగరు డాక్టరును సంప్రదించండి కొన్ని ఇతర జాగ్రత్తలు కూడా పాటించాలి.
7. వ్యాయామం
- ఆరోగ్యవంతులు రోజుకు 30 నిమిషములు పైన తమ అత్యధిక శక్తిలో 40-80% వ్యాయామం (ఉదా:15 – 20నిముషాలలో ఒకమైలు) చేయాలి. అదనంగా ఇతర వ్యాయామాలు కూడా చేస్తే ఉపయోగం ఉంటుంది.
- గుండెజబ్బు, ఊపిరితిత్తులు జబ్బు, నరాల జబ్బు, ఎముకలు మరియు కీళ్ళ జబ్బు ఉన్నవారు వ్యాయామమును డాక్టరు సూచనల మేరకు చేయవలెను.
8. మానసిక వత్తిడిని తగ్గించుకోవలెను:
యోగా, ధ్యానము, మొదలగునవి ప్రయత్నించవచ్చు.
పై సూచనలు పాటించడం ద్వారా, గుండెపోటు మరియు పక్షవాతం రాకుండా కనీసం 50-80% వరకు
నివారించవచ్చునని వివిధ శాస్త్రీయ అధ్యయనాలో వెల్లడి అయింది.