కొరొనరి ఆంజియోగ్రామ్ అనగా నేమి? దీన్ని ఎందుకు చేస్తారు?

కొరొనరి ఆంజియోగ్రామ్ అనేది గుండె దమనుల స్థితిని తెలుసుకొనుటకు చేసే ఒక పరీక్ష. ఇది గుండె దమనుల
వ్యాధి ఉన్న వారికి చేస్తారు. గుండె నిరంతరం రక్తం పంపు చేసే ఒక కండరం. అది నిరంతరంగా పని చేస్తూ ఉండటానికి దానికి ఎల్లవేళలా గ్లూకోజ్, ఆక్సిజన్ వంటి పోషక పదార్థాలు అవసరం. అవి గుండెకు మూడు ముఖ్యమైన గుండెదమనుల యెక్క రక్త సరఫరా ద్వారా అందుతాయి. షుగరు, బిపి, అదిక కొలెస్ట్రాల్, పొగత్రాగుట వంటి వాటి వల్ల దమన కాఠిన్యం ఎర్పడి ఈ గుండె దమనులు సన్నబడవచ్చు. దాని వల్ల ఛాతి నొప్పి (Angina) కాని, గుండె పోటు కాని కలగవచ్చు. ఈ రకంగా గుండె దమనులు సన్నబడటాన్ని అధ్యయనం చేసేవరీక్షే ఆంజియోగ్రామ్.

కొరొనరి ఆంజియోగ్రామ్ పరీక్షను ఎక్కడ చేస్తారు? ఎలా చేస్తారు?

ఆంజియోగ్రామ్ పరీక్షను క్యాత్ ల్యాబ్ అనే ప్రత్యేకమైన ఆపరేషన్ థియేటర్లో చేస్తారు. దీనిలో వంక్చర్ నీడిల్, షీత్, గైడ్వెర్, కృధ్టర్, కాంట్రాస్ట్ వంటివి ఎన్నో వాడతారు. దీనిని చేతి మణికట్టు దగ్గర నుంచి కాని లేదా తొడ దగ్గర నుంచి కాని చేస్తారు. మొదట షీత్ అనే ఒక ట్యూబ్ ని చేసే ప్రాంతంలో దమనిలోనికి జోప్పించి ఉంచుతారు. తర్వాత కృధ్టర్ అనే ఒక మృదవైన సన్నని వంగే ట్యూబ్ ని అందులో నుంచి గుండె దమనుల వరకు పంపించి దాని గుండా కాంట్రస్ట్ అను పదార్థాన్ని గుండె దమనుల్లోకి ఎక్కించి వాటిని ఎక్సరే వీడియో లాగా చిత్రీకరిస్తారు. దీనిలో దమనులు న న్నబడటం లేదా మూసుకుపోవటం కనబడుతుంది.

ఆంజియోగ్రామ్ పరీక్ష చేసినపుడు ఎటువంటి దుప్పరిణామాలు ఉండవచ్చు?

కొరొనరి ఆంజియోగ్రామ్ ఓ నమ్మదగిన పరీక్ష, దీనిలో 99శాతం మందికి ఎటువంటి దుప్పరిణామాలు ఉండవు.
వెయ్యి మందిలో ఒకరి కన్నా తక్కువ మందికి మాత్రమే గుండె పోటు, పక్షవాతం, అత్యవసరంగా ఆంజియోప్లాస్టి
లేదా బైపాస్ ఆపరేషన్ చేయవలసిన అవసరం రావడం లేదా ప్రాణహాని వంటి తీవ్రవరిణామాలు కలుగుటకు
అవకాశం ఉంటుంది. అలాగే కొద్ది మందికి కాంట్రాస్ట్ పడకపోవడం (Allergic reaction) లేదా మూత్రపిండాల పై తాత్కాలిక దుష్ప్రభావం (Contrast Induced Nephropathy) కలుగుటకు అవకాశం ఉంటుంది. కొద్ది మందికి చేసిన ప్రాంతంలో కొద్దిగా రక్తకారటం కాని లేదా కమిలినట్టు అవడం జరగవచ్చు.

కొరొనరి ఆంజియోగ్రామ్ పరీక్ష నుంచి మనము ఏమి ఆశించవచ్చు?


Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *