రక్తపోటు అనగా ఏమిటి?
మన శరీరంలోని అన్ని అవయవాలకు, అవి నిరంతరం పనిచేయుటకు కావలిసిన ఆక్సిజను, గ్లూకోస్ మొదలగు పోషక పదార్థాలను రక్తనాళాలు సరఫరా చేస్తాయి. దీనికోసం రక్తం కొంత వేగంగా కొద్ది దూరం పారడానికి ఒత్తిడి అవసరం.
దీనినే రక్తపోటు (బి.పి.) అంటారు.
బి.పి. కొలతలో గుండె సంకోచ వ్యాకోచాల సమయంలో ఉండే రెండు అంకెలు ఉంటాయి. ఇవి పైన మరియు క్రింద కాని లేదా పక్కపక్కన కాని సూచించబడతాయి.
ఉదా : 120/80mm Hg బి.పి. అంటే గుండె సంకోచించినపుడు (రక్తాన్ని పంపు చేసినపుడు) 120mm Hg ఒత్తిడితో
మరియు వ్యాకోచించినపుడు (అంటే రెండు హృదయస్పందనల మధ్య సమయంలో) Bomm Hg ఒత్తిడితో రక్తప్రసరణ
జరుగుతుందని అర్థం.
రక్తపోటు అన్నివేళలా ఒకేలా ఉండదు. ఇది సమయానుసారం మరియు మన శారీరిక మరియు మానసిక శ్రమను బట్టి కొంత
వరకు మారుతూ ఉంటుంది.
అధిక రక్తపోటు అంటే ఎంత?
సాధారణంగా రక్తపోటు 120/80mm Hg కన్నా తక్కువ ఉండాలి. ఇది తరుచుగా లేదా నిరంతరంగా 60 సంవత్సరాల
లోపు వయసు వారిలో 140/90 కన్నా మరియు 60 సంవత్సరాలు పైబడిన వారిలో 150/90 కన్నా ఎక్కువగా
ఉంటే, దాన్ని అధిక రక్తపోటుగా గుర్తించి దానిని అంతకన్నా తక్కువుకు తీసుకురావాలి.
అధిక రక్తపోటు ఎందువల్ల వస్తుంది?
అధిక రక్తపోటు రెండు రకాలు
- ప్రాధమిక రక్తపోటు (ESSENTIAL HYPERTENSION) : దాదాపు 95% మందికి ఈ రకమైన అధిక రక్తపోటే
ఉంటుంది. దీనికి ఒక నిర్దిష్టమైనా లేదా ప్రత్యేకమైన కారణం ఉండదు. ఇది వయసు, బరువు, జీవన విధానం, ఆహార, జాతి మరియు మనకు తెలియని ఎన్నో కారణాల వల్ల కలుగుతుంది. - అన్యకారణ లేదా ద్వితీయ రక్తపోటు (SECONDARY HYPERTENSION) : ఇది కేవలం 5% మందిలో ఉండేటువంటి రకం, ఇది ఒక నిర్దిష్టమైన కారణం వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా మూత్రపిండముల సమస్యలు లేదా హార్మోన్ల అసమతుల్యత వల్ల కలుగుతుంది.
అధిక రక్తపోటు వల్ల ప్రమాదం ఏమిటి?
మరీ ఎక్కువగా వుంటే తప్ప, రక్తపోటు అధికంగా ఉండటం వల్ల కొన్ని రోజులు, వారాలు లేదా నెలల్లో ఏమీ కాదు. ఎక్కువ మందికి దీని వల్ల ఎటువంటి లక్షణాలూ ఉండవు. కాని నియంత్రణ లేకుండా అధికంగా కొనసాగితే, కొన్ని సంవత్సరాల కాలంలో అది రక్తనాళాలకు హాని చేసి అవి సన్నబడుటకు మరియు దమన కాఠిన్యానికి దారి తీసి తద్వారా:
- గుండె దమనులు దెబ్బ తినడం వల్ల గుండె నొప్పి మరియు గుండెపోటు (24% గుండెపోటు మరణాలు అధిక రక్తపోటువల్ల కలిగేవే).
- గుండెమీద ఒత్తిడి పెరగడం వల్ల గుండె సోలిపోవుట (HEART FAILURE)
- మెదడుకు సరఫరా చేసే రక్తనాళాలు దెబ్బ తినడం వల్ల పక్షవాతం (57% పక్షవాతం వల్ల కలుగు మరణాలు అధిక రక్తపోటు వల్ల కలిగేవే).
- మూత్ర పిండాలకు సరఫరా చేసే రక్తనాళాలు దెబ్బ తినడం వల్ల అవి పనిచేయకుండా పోవడం.
- కంటికి సరఫరా చేసే రక్తనాళాలు దెబ్బ తినడం వల్ల కంటి చూపు తగ్గడం లేదా పోవడం.
- మరియు అనేక అనర్థాలకు దారి తీస్తుంది.
రక్తపోటును నియంత్రించడం ఎలా ?
రక్తపోటును నియంత్రించుటకు మనం చేయగల జీవనశైలిలో మార్పులు :
- పొగత్రాగుట మానేయాలి : పొగత్రాగిన ప్రతిసారీ రక్తపోటు కనీసం గంటపాటు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువుగా
ప్రొగత్రాగే వారిలో, ఇది రోజంతా ఎక్కువుగానే ఉంటుంది. - బరువు తగ్గుట : బరువు అధికంగా ఉన్నవాళ్ళు బరువు తగ్గడం వల్ల, రక్తపోటు కూడా తగ్గుతుంది.
భోజనంలో ఉప్పు తగ్గించుట మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొనుట : ఒక వ్యక్తి సగటున
రోజుకి 5 గ్రాములు ఉప్పు మాత్రమే తీసుకోవలసి ఉండగా, ఇప్పుడు 10 గ్రాముల పైగా తీసుకుంటున్నారు. దీన్ని తగ్గించాలి మరియు ఆహారంలో నూనె మరియు కొవ్వు పదార్థాలు తగ్గించి, కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు ఎక్కువగా
తీసుకోవాలి. - వ్యాయామం చేయుట : క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్తపోటును తగ్గించు కోవచ్చు
- మద్యపానం మానివేయుట : మద్యపానం మానివేయడం ద్వారా రక్తపోటును తగ్గించుకోవడమే కాక ఎన్నో
ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. - మానసిక ఒత్తిడిని తగ్గించుకొనుట : యోగా, ధ్యానము, ఆహ్లాదకరమైన సంగీతం వినడం, కుటుంబంతో
సమయం గడపడం వంటివి ఎవరికి అనుకూలమైనవి వారు ఎంచుకుని మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా
రక్తపోటును కూడా కొంతవరకు తగ్గించుకోవచ్చు. - షుగరు మరియు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవాలి : రక్తనాళాలకు హానిని తగ్గించేందుకు, అధిక రక్తపోటు
ఉన్నవారు తరుచుగా షుగరు మరియు కొలెస్ట్రాల్ ను పరీక్షించుకొని వాటిని కూడా అదుపులో ఉంచుకోవాలి.
పై నియమాలన్నీ పాఠించినా కానీ రక్తపోటు ఉండవలసిన లక్ష్యాని కన్నా ఎక్కువగా ఉంటే, దాన్ని డాక్టరు సలహామేరకు
క్రమం తప్పకుండా మందులు కూడా వేసుకుని రక్తపోటును నియంత్రించుకొని తరచుగా పరీక్షించుకుంటూ ఉండాలి.