కొరొనరి ఆంజియోప్లాస్టి (Coronary Angioplasty or PTCA or PCI) – రోగి సమాచార పత్రము

Coronary Angioplasty

కొరొనరి ఆంజియోప్లాస్టి మూసుకుపోయిన గుండె రక్తనాళాలను తెరచి, గుండె కండరాలకి తిరిగి రక్తసరఫరా చేయించే ఓ వైద్య పద్ధతి. దీన్ని గుండెకండరాలకి రక్త సరఫరా తగ్గడం వల్ల వచ్చే గుండెనొప్పిని తగ్గించడానికి, గుండెపోటు వల్ల గుండె కండరాలు దెబ్బతినకుండా ఉండడానికి చేస్తారు. ఈ ప్రక్రియ కొన్ని సార్లు గుండెపోటు వచ్చాక అత్యవసర పరిస్థితిల్లో చేస్తారు. దాన్ని ప్రైమరి ఆంజియోప్లాస్టి (Primary Angioplasty) అంటారు. ఆంజియోప్లాస్టి ప్రక్రియ:ప్రక్రియ ముందు రోగిని ఓ తక్కువ మోతాదు మత్తుమందుతో రిలాక్స్ చేసారు. […]