కొరొనరి ఆంజియోప్లాస్టి మూసుకుపోయిన గుండె రక్తనాళాలను తెరచి, గుండె కండరాలకి తిరిగి రక్తసరఫరా చేయించే ఓ వైద్య పద్ధతి. దీన్ని గుండెకండరాలకి రక్త సరఫరా తగ్గడం వల్ల వచ్చే గుండెనొప్పిని తగ్గించడానికి, గుండెపోటు వల్ల గుండె కండరాలు దెబ్బతినకుండా ఉండడానికి చేస్తారు. ఈ ప్రక్రియ కొన్ని సార్లు గుండెపోటు వచ్చాక అత్యవసర పరిస్థితిల్లో చేస్తారు. దాన్ని ప్రైమరి ఆంజియోప్లాస్టి (Primary Angioplasty) అంటారు.
ఆంజియోప్లాస్టి ప్రక్రియ:
ప్రక్రియ ముందు రోగిని ఓ తక్కువ మోతాదు మత్తుమందుతో రిలాక్స్ చేసారు. ప్రక్రియ ఎక్కడ చేస్తారో (సాధారణంగా కుడితొడ లేదా చెయ్యి) అక్కడ జుట్టుని తొలగిస్తారు. ఇన్ఫెక్షన్ రాకుండా క్రిములు చేరకుండా) ఆ ప్రాంతాన్ని ప్రత్యేక క్రిమిసంహారక మందులతో శుభ్రపరుస్తారు. కుడి తొడ లేదా చేతికి మత్తుని కలిగించేందుకు మత్తు సూదిని ఇస్తారు. ఆ తరువాత కుడి తొడ లేదా చేతి ధమనిలో షీత్ (Sheath) అనబడు ఒక ట్యూబును ఉంచుతారు. మిగతా ప్రక్రియ అంతా దాని ద్వారానే చేస్తారు. ఆంజియోగ్రాము పరీక్షలోలాగా కెధటర్ (Catheter) అనే ఒక సన్నటి ట్యూబుని మూసుకుపోయిన గుండె ధమని (Coronary | Artery) దగ్గర ఉంచుతారు.
గైడ్వెర్ (Guide Wire) అను ఒక సన్నటి వైరు మూసుకుపోయిన హృదయ ధమనిలోకి పంపి దాని మీదగా గాలితీసేసిన బుడగని (Angioplasty Baloon) మూసుకుపోయిన ధమని భాగానికి చేర్చి Dye తో నింపుతారు. మూసుకుపోయిన లేక సన్నబడిన ధమని భాగం తెరుచుకుంటుంది. ఆ తరువాత బుడగలోనుంచి Dye ని తీసేసి దాన్ని కృశింప చేసి బయటకు తీసేస్తారు. ఇప్పుడు అవసరాన్ని బట్టి స్టెంట్
| (Stent) అనే ఉపకరణాన్ని ఉంచుతారు.
స్టెంట్ (Stent) అనేది ఒకసారి రక్తనాళాన్ని వెడల్పు చేసిన తరువాత, ఆ రక్తనాళం తిరిగి
సన్నబడకుండా ఉండేందుకు ఉంచే ఓ సన్నని, చిన్న , మృదవైన, వ్యాకోచింపచేయగల మెటల్ ట్యూబ్. దీన్ని శాశ్వతంగా అక్కడే ఉంచేస్తారు.
ఆంజియోప్లాస్టి ఫలితాలు మరియు దుష్పరిణామాలు:
ఈ పద్ధతిలో 95% కన్నా ఎక్కువ మందికి సత్ఫలితాలు (Success) ఉంటాయి. వంద మందిలో ఒకరికన్న తక్కువ మందికి మాత్రమే ప్రాణహాని వంటి తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయి.
కొద్ది మందికి మాత్రము చేసిన దగ్గర వాపు రావడం, కమిలినట్టు అవడం వంటి తాత్కాలిక సమస్యలు ఉండవచ్చు. కొంత మందికి కాంట్రాస్ట్ (Contrast) పడకపోవడం (Allergic Reaction) కాని లేదా మూత్రపిండాల పై తాత్కాలిక చెడు ప్రభావం (Contrast Induced nephropathy) కలుగుటకు అవకాశం ఉంది.
ఈ ఆంజియోప్లాస్టి పద్ధతిలో చికిత్స తీసుకున్న వారికి, దీర్ఘకాలంలో స్టెంట్ సుకుపోవడానికి (Instant Restenosis) అవకాశం ఉంది. అది కేవలం బెలూన్ ఆంజియోప్లాస్టి (POBA) చేసుకున్న వారిలో 20-30%, సాధారణ లోహపు స్టెంట్ (BMS) పెట్టుకున్న వారికి 10-20% మరియు మెడికేటెడ్ స్టెంట్ (DES) పెట్టుకున్న వారిలో 3-5% జరుగుతుంది.