1. పొగత్రాగడం (Smoking)
2. రక్తంలో కొలెస్ట్రాల్ కొవ్వు అధికంగా ఉండటం (Dyslipidemia) channe
3. అధిక బరువు (overweight / Obesity)
4. వ్యాయామం లేకపోవడం (Lack of exercise)
5. మధుమేహం (షుగర్ వ్యాధి) (Diabetes)
6. రక్తపోటు (High B.P)
7. మానసిక వత్తిడి (Psychosocial Stress)

90% మంది రోగులకు ఈ పై అంశములే గుండెపోటు లేదా పక్షవాతానికి కారణాలు.

నివారించే మార్గాలు:

1. పొగత్రాగడం పూర్తిగా మానేయాలి

1. పొగత్రాగడం పూర్తిగా మానేయాలి:
పొగత్రాగుట వలన గుండెపోటు, పక్షవాతం, స్వాసకోశాల జబ్బు, ఊపిరి తిత్తుల క్యాన్సర్ మరియు ఎన్నో వ్యాధులు
పొగత్రాగిన వారికి రావడమేకాక, దాన్ని పీల్చుకున్న కుటుంబీకులకి, ఇతరులకి కూడా వచ్చే అవకాశం ఉంది.

2. చెడు కొలెస్ట్రాల్ కొవ్వును నియంత్రించుకోవలెను:

(LDL) (చెడు) కొలెస్ట్రాల్ – 130 mg/dl కన్నాతక్కువ
                                   – 100 mg | di(షుగరు వ్యాధి లేదా , 2 ప్రమాద కారణాలు ఉన్నవారు)

HDL (మంచి) కొలెస్ట్రాల్ – 40 mg/dl (పురుషులలో) కన్నా ఎక్కువ
                                      – 50 mg/dl (స్త్రీలలో) కన్నా ఎక్కువ

Triglyceride కొవ్వు -150 mg/dl కన్నా తక్కువ

3. షుగరు వ్యాధి (Hb A,C<7%, FBS < 110 mg% is Normal):

ఆహారము ద్వారా, వ్యాయామం ద్వారా మరియు మందుల ద్వారా (షుగరు డాక్టరు సహాయంతో) షుగరును
నియంత్రణలో ఉంచుకోవాలి.


4. రక్తపోటు:

B.P.లక్ష్యం -140/90mm Hg కన్నా తక్కువ.
                 – 130/80 mm Hg(మూత్ర పిండాల లేదా షుగరు వ్యాధి ఉన్న రోగులకు) కన్నా తక్కువ

.లక్ష్య సాధన మార్గం:

5. అధిక బరువు (స్థూల కాయం):

లక్ష్యం – BMI (బరువు కేజీలలో/ఎత్తుమీటర్లలో) 18-23 మధ్య ఉండవలెను
          – నడుము కొలత – మగవాళ్ళలో 36 ఇంచీలకన్న తక్కువ మరియు
              ఆడవాళ్ళలో 31 ఇంచీలకన్న తక్కువ ఉండవలెను.
     ఆహారంలో పిండి పదార్థాలు మరియు నూనె పదార్థాలు తగ్గించి, తద్వారా కాలరీలు తగ్గించి బరువు తగ్గవలెను.
బరువు అధికంగా ఉన్న వారు, మొదటి సంవత్సరంలో వారి బరువులో 10%(పదిశాతం) తగ్గవలెను.

6. ఆహారం

7. వ్యాయామం

8. మానసిక వత్తిడిని తగ్గించుకోవలెను:

యోగా, ధ్యానము, మొదలగునవి ప్రయత్నించవచ్చు.

పై సూచనలు పాటించడం ద్వారా, గుండెపోటు మరియు పక్షవాతం రాకుండా కనీసం 50-80% వరకు
నివారించవచ్చునని వివిధ శాస్త్రీయ అధ్యయనాలో వెల్లడి అయింది.
Please follow and like us:

Leave a Reply