అధిక రక్తపోటు – సమాచార పత్రము

రక్తపోటు అనగా ఏమిటి? మన శరీరంలోని అన్ని అవయవాలకు, అవి నిరంతరం పనిచేయుటకు కావలిసిన ఆక్సిజను, గ్లూకోస్ మొదలగు పోషక పదార్థాలను రక్తనాళాలు సరఫరా చేస్తాయి. దీనికోసం రక్తం కొంత వేగంగా కొద్ది దూరం పారడానికి ఒత్తిడి అవసరం.దీనినే రక్తపోటు (బి.పి.) అంటారు. బి.పి. కొలతలో గుండె సంకోచ వ్యాకోచాల సమయంలో ఉండే రెండు అంకెలు ఉంటాయి. ఇవి పైన మరియు క్రింద కాని లేదా పక్కపక్కన కాని సూచించబడతాయి. ఉదా : 120/80mm Hg బి.పి. […]